శంషాబద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమస్య... గన్నవరం ఎయిర్ పోర్టుకు విమానాలు

హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించక విమానాల ల్యాండింగ్ కు ఇబ్బందికరంగా మారింది.

Update: 2025-09-26 03:17 GMT

హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించక విమానాల ల్యాండింగ్ కు ఇబ్బందికరంగా మారింది. నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో పాటు ఈరోజు ఉదయం నుంచి మేఘాలు కమ్ముకుని ఉండటంతో విమానాల ల్యాండింగ్ కు ఇబ్బందికరంగా మారింది. అనేక విమానాలు ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించారు.

భారీ వర్షం.. మంచుతో...
ఉదయం నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ సమస్య ఎక్కువగా ఉంది. వర్షానికి తోడు మంచు కూడా తోడవ్వడంతో పలు విమానాలను ఇతర ప్రాంతాల విమానాశ్రయాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని కోరుతున్నారు. వారిని గమ్యస్థానాలను చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News