నేడు ఈడీ ఎదుటకు విజయసాయిరెడ్డి

వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించనున్నారు

Update: 2026-01-22 04:12 GMT

వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నేడు ఈడీ ఎదుటకు విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన మరికాసేపట్లో హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు.

మద్యం కుంభకోణంలో...
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఇప్పటికే సిట్ అధికారుల ఎదుట హాజరైన విజయసాయిరెడ్డి పలు కీలక సమాచారం ఇచ్చారు. ఈ కేసులో పెద్దయెత్తు మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానం రావడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. విజయసాయిరెడ్డి వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించి తదుపరి చర్యలకు దిగే అవకాశముంది.


Tags:    

Similar News