Hyderabad : పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ బాధ్యతలు
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ బాధ్యతలను చేపట్టారు.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుత కమిషనర్ గా ఉన్న సీవీ ఆనంద్ నుంచి ఆయన బాధ్యతలను తీసుకున్నారు. అలాగే ఆర్టీసీ ఎండీగా వై నాగిరెడ్డి బాధ్యతలను స్వీకరించారు. వేద మంత్రాల మధ్య సజ్జనార్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలను చేపట్టారు.
సైబర్ నేరగాళ్లను..
బాధ్యతలను స్వీకరించిన సజ్జనార్ కు నగర పోలీసు అధికారులు పలువురు అభినందనలు తెలిపారు. నగరంలో శాంతి భద్రతలను సమర్ధవంతంగా కట్టుదిట్టంగా అమలు చేస్తామని, సైబర్ నేరాలతో పాటు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి దృష్టి పెడతానని వీసీ సజ్జనార్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అదే సమయంలో ప్రజల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుతామని కూడా సజ్జనార్ అన్నారు.