Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసులో నేటితో విచారణ పూర్తి

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ నేటితో ముగియనుంది

Update: 2025-12-25 06:49 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ నేటితో ముగియనుంది. దీంతో ఈ కేసులో కీలకంగా మారిన పెన్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకుని విచారణ చేయాలని భావిస్తున్నారు. ప్రభాకర్ రావును రెండు వారాల పాటు విచారించిన సిట్ రాజకీయ నాయకుల ప్రమేయంపై ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఈ కేసులో పెన్ డ్రైవ్ కీలకంగా మారింది.

రేపు విడుదల చేయాల్సి ఉండగా...
ఈరోజు ప్రభాకర్ రావును విచారించిన తర్వాత రేపు ఆయనను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఈ కేసులో మరికొందరిని విచారించేందుకు తిరుపతన్న, భుజంగరావులను, రాధాకిషన్ రావు, ప్రవీణరావులను సిట్ కార్యాలయానికి ఈరోజు విచారణ కు పిలిపించారు. వీరందరూ ఈ కేసులో నిందితులు కావడంతో ఆధారాలు సేకరించే ప్రయత్నంలో భాగంగా వారిని విచారించనున్నారు.


Tags:    

Similar News