హైదరాబాద్ వెళ్లే వారికి అలెర్ట్.. దారి మళ్లింపు

హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.

Update: 2025-02-17 06:58 GMT

హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఐదు రోజుల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. నిన్నటి నుంచే ఈ మార్గంలో వాహనాలను అనుమతించడం లేదు. సూర్యాపేట్ జిల్లాలోని దూరాజ్ పల్లి లింగమంతుల స్వామి జాతర సందర్భంగా ఈ ఆంక్షలను విధించారు.

ఖమ్మం వెళ్లేవారు కూడా...
దాదాపు ఇరవై ఐదు లక్షల మంది హాజరు కానుండటంతో విజయవాడ వైపు వెళ్లే వారు నార్కెట్ పల్లి నుంచి అద్దంకి జాతీయ రహదారి మీదుగా విజయవాడ చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే ఖమ్మం వెళ్లేవారు కూడా సూర్యాపేటలోకి ఎంటర్ కాకుండా ముందుగానే టర్న్ తీసుకుని ఖమ్మం వైపు మళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ పెద్దగట్టు జాతర రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ నెల 20వ తేదీ వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
Tags:    

Similar News