Hyderabad : నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ

నేడు హైదరాబాద్ లో బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అస్తమా రోగులకు ప్రతి ఏటా చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు

Update: 2025-06-08 01:58 GMT

నేడు హైదరాబాద్ లో బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అస్తమా రోగులకు ప్రతి ఏటా చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు. తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా బత్తిన సోదరుల చేప ప్రసాదం స్వీకరించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈరోజు, రేపు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశారు.

లక్ష చేప పిల్లలను సిద్ధం చేసి...
ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.న ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకూ చేప ప్రసాదం పంపినీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి అవసరమైన లక్ష చేప పిల్లలను అధికారులు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించనున్నారు. చేప ప్రసాదం స్వీకరించడానికి నిన్న రాత్రికే హైదరాబాద్ కు ఇతర రాష్ట్రాల నుంచి చేరుకున్నారు. మృగశిర కార్తె రోజున బత్తిన సోదరులు ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. అస్తమా రోగులకు ఇది బాగా పనిచేస్తుందని భావించి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇందుకోసం పెద్ద పెద్ద క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News