హైదరాబాద్ లో ఇకపై 5 రూపాయలకే టిఫిన్
గ్రేటర్ హైదరాబాద్ లోని ఇందిరా క్యాంటీన్లలో 5 రూపాయల భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా పెట్టాలనే నిర్ణయానికి బల్దియా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ లోని ఇందిరా క్యాంటీన్లలో 5 రూపాయల భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా పెట్టాలనే నిర్ణయానికి బల్దియా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. 11 ప్రాంతాల్లో కూర్చుని తింటున్న కేంద్రాలను పునరుద్ధరించాలని, 139 ప్రాంతాల్లో షెడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. అన్నపూర్ణ కేంద్రాలు లక్షలాది మందికి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఉన్నాయి. ఈ కేంద్రాల పేరును 'ఇందిరా క్యాంటీన్'గా మార్చాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ కేంద్రాల్లో మధ్యాహ్నం పూట మాత్రమే 5 రూపాయలకు భోజనం అందుబాటులో ఉండేది. ఇకపై ఈ ఇందిరా క్యాంటీన్లలో ఉదయం పూట అల్పాహారం కూడా అందించనున్నారు.