ఉద్యోగం వచ్చిందని మూడు రోజుల కిందట సందడి

సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు మృతుల సంఖ్య 46కి చేరింది.

Update: 2025-07-02 10:15 GMT

సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు మృతుల సంఖ్య 46కి చేరింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలో పేలుడు తీవ్రతకు కూలిన మూడంతస్తుల భవనం శిథిలాలు తొలగించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన జస్టిన్‌ మూడు రోజుల క్రితమే సిగాచి పరిశ్రమలో ఉద్యోగంలో చేరారు. మంచి ఉద్యోగం దొరికిందని ఆ యువకుడి కుటుంబం సంతోషించే లోపే ఊహించని విషాదం వెంటాడింది. విధులకు హాజరైన జస్టిన్‌ ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ఆయన తండ్రి రామ్‌దాస్‌ తన కుమారుడి ఫొటో పట్టుకుని ఆచూకీ చెప్పండంటూ కన్నీళ్లతో వేడుకుంటున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

Tags:    

Similar News