Osmania University : ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్

హైదరాబాద్‎ ఓయూలో టెన్షన్ నెలకొంది. మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం నేపథ్యంలో నేడు ఓయూ జేఏసీ తెలంగాణ బంద్‎కు పిలుపు నిచ్చింది

Update: 2025-08-22 03:38 GMT

హైదరాబాద్‎ ఓయూలో టెన్షన్ నెలకొంది. మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం నేపథ్యంలో నేడు ఓయూ జేఏసీ తెలంగాణ బంద్‎కు పిలుపు నిచ్చింది. బంద్ కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్వాడీ గో బ్యాక్, గుజరాతి, రాజస్థాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొత్తపల్లి తిరుపతిని అరెస్ట్ చేయడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బంద్ కు మద్దతు పెరగడంతో కొత్తపల్లి తిరుపతిని అర్థరాత్రి పోలీసులుఅదుపులోకి తీసుకున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

బంద్ కు పిలుపు నివ్వడంతో...
నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు వెంటనే తిరుపతిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి నేతలను అర్థరాత్రి అరెస్ట్ చేయడంసరైన పద్దతి కాదంటూ విద్యార్థి సంఘాలు నినాదాలు చేస్తున్నాయి. అరెస్ట్ అనైతికం, అక్రమం అంటున్న విద్యార్థులు కొత్తపల్లి తిరుపతి, వేణుగోపాల్ ను వెంటనే విడుదల చేయాలని ఓయూ విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నార. మార్వాడీ గో బ్యాక్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న పృథ్వీరాజ్ యాదవ్‎ను అరెస్ట్ చేసిన పోలీసులు విడిచిపెట్టాలని కోరుతున్నారు.


Tags:    

Similar News