Hyderabad : యుద్ధం ముగిసేదెన్నడు.. కడుపు నిండేదెప్పుడు?

హైదరాబాద్ నగరం గత కొన్ని దశాబ్దాలుగా విస్తరిస్తుంది.

Update: 2026-03-12 04:37 GMT

హైదరాబాద్ నగరం గత కొన్ని దశాబ్దాలుగా విస్తరిస్తుంది. ఎంతో మందికి ఉపాధికి అడ్రస్ గా మారింది. సాఫ్ట్ వేర్ సంస్థల నుంచి చిరు వ్యాపారాల వరకూ హైదరాబాద్ నగరం ఆశ్రయమిస్తుంది. ఐదు రూపాయల భోజనం నుంచి ఐదు వేల రూపాయల భోజనం అందించే నగరంగా ప్రసిద్ధి గాంచింది. అందరికీ అందుబాటులో ఉండే నగరంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఫుడ్ ఇండ్రస్ట్రీ ఇబ్బంది పడుతుంది. వివిధ రుచులు, సౌత్, నార్త్ లతో కూడి భోజనాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కాస్మోపాలిటన్ నగరమయిన హైదరాబాద్ లో ఏ సమయంలోనైనా కడుపు నింపుకునేందుకు ఫుడ్ లభిస్తుంది. అయితే ఎల్.పి.జి గ్యాస్ కొరత కారణంగా ఫుడ్ ఇండ్రస్ట్రీ పడకేసింది.

లక్షల సంఖ్యలో పర్యాటకులు...
హైదరాబాద్ కు రోజుకు లక్షలాది మంది వచ్చిపోతుంటారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే వారితో పాటు పర్యాటకంగా హైదరాబాద్ అభివృద్ధి చెందడంతో పర్యాటకుల సంఖ్య రోజుకు లక్షల్లో ఉంటుంది. వేసవి కాలంలో పర్యాటకులు అధికసంఖ్యలో తరలివస్తారు. అలాంటి హైదరాబాద్ లో నేడు భోజనం దొరకడం కష్టంగా మారింది. టిఫిన్ల నుంచి భోజనం వరకూ అనేక హోటళ్లు గ్యాస్ కొరతతో ఇప్పటికే మూత బడగా, మరికొన్ని ధరలు పెంచి పరిమితమైన వాటిని మాత్రమే అందిస్తున్నారు. జిహ్వచాపల్యాన్ని తీర్చే వంటలు దూరమయ్యాయి. గ్యాస్ లేదు...హోటల్ మూత అని బోర్డులు అనేక చోట్ల హైదరాబాద్ లో దర్శనమిస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
భారీగా ఆదాయానికి గండి...
ప్రధానంగా కూకట్ పల్లి, అమీర్ పేట్, పంజాగుట్ట,మాదాపూర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, దిల్ సుఖ్ నగర్, ఎల్.బి.నగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ఇటీవల కాలంలో అనేక హోటళ్లు వెలిశాయి. హైదరాబాద్ లో ఉన్న హోటల్ రంగమే లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇక బార్ అండ్ రెస్టారెంట్లు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. ఒడిశా, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి హైదరాబాద్ ఆశ్రయం కల్పిస్తుంది. అలాంటి నగరం ఇప్పుడు గ్యాస్ కొరతతో అతలాకుతలమవుతుంది. ఇప్పటికే కొన్నిహోటళ్లు మూతపడగా, మరికొన్ని క్లోజ్డ్ పరిస్థితికి చేరుకున్నాయి. ధరలు పెంచినా నాణ్యమైన ఫుడ్ దొరుకుంతుందన్ననమ్మకం కోల్పోయింది. దీంతో హోటల్ రంగంతో పాటు ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయానికి గండిపడే అవకాశముందన్న విశ్లేషణలువెలువడుతున్నాయి. యుద్ధం ముగిసేదెప్పుడు.. కడుపు నింపేదెప్పుడు? అన్న ప్రశ్నకు మాత్రం జవాబు దొరకడం లేదు.


Tags:    

Similar News