Kavitha : కవిత ఇంటికి సీబీఐ.. 16న విచారణకు రావాలని
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారులు ఈ సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు కవిత ఇంటికి చేరుకుని ఆమెకు సమన్లకు అందచేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో నిందితులందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో
అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 16వ తేదీన హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కవితతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కోసం ఆరుగురికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే విచారణకు రావాలని సమన్లలో పేర్కొన్నారు.