చంచల్ గూడ జైలులో ఉద్రిక్తత
హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో ఉద్రిక్తత నెలకొంది
హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్లు ఘర్షణ పడటంతో ఈ ఘటన జరిగింది. రౌడీషీటర్ గా ఉన్న జాబ్రి, మరో ఖైదీ దస్తగిరి మధ్య జరిగిన వివాదం దాడులకు దారితీసింది. దస్తగిరి, జాబ్రీల మధ్య పాతకక్షలున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య...
ఈ ఘర్షణలో ఇద్దరికీ గాయాలయ్యాయని తెలుస్తోంది. జాబ్రీపై దస్తగిరి దాడి చేయడంతో ఇద్దరు ఒకరినొకరు కొట్టుకోవడంతో ఈ ఘర్షణలో ఇద్దరికీ గాయాలయ్యాయని చెబుతున్నారు. దీంతో దస్తగిరి, జాబ్రిలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే జైలులో దాడికి సంబంధించిన విషయం బయటకు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.