Telangana Elections : ఎవరు చెప్పినా మేమింతేనంటున్న హైదరాబాదీలు.. అతి తక్కువ పోలింగ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఎప్పటిలాగే హైదరాబాదీలు తక్కువ మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Update: 2023-11-30 05:16 GMT

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమయింది. ఎప్పటిలాగే హైదరాబాదీలు తక్కువ మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొద్దిసేపు కాస్త జనంతో హడావిడిగా కనిపించినా... తర్వాత మాత్రం పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. వచ్చిన వాళ్లు వచ్చినట్లే ఓటు వేసి వెళ్లిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తొలి రెండు గంటల్లో...
హైదరాబాద్‌లో తొలి రెండు గంటల్లో కేవలం 4.57 శాతం మాత్రమే నమోదయింది. అత్యల్లంగా నాంపల్లిలో 0.5 శాతం, సనత్ నగర్ 1.2 శాతం, కూకట్‌పల్లిలో 1.2 శాతం అత్యధికంగా కూకట్‌పల్లిలో 15 శాతం పోలింగ్ నమోదయింది. ఎంత చెప్పినా.. అన్ని సంస్థలకు సెలవులు ప్రకటించినా, సెలబ్రిటీలు వచ్చి ప్రచారం చేసినా హైదరాబాదీలు మాత్రం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రావడం లేదు. మరి మధ్యాహ్నం నుంచైనా పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.


Tags:    

Similar News