హోటల్ తాజ్ బంజారా సీజ్
తాజ్ బంజారా హోటల్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు.
తాజ్ బంజారా హోటల్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. 1.43 కోట్ల బకాయీల ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేశారు. రెండేళ్ల నుంచి ఆస్తి పన్నును చెల్లించకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. ఎన్నిమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో హోటల్ ను సీజ్ చేశారు.
ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో...
బంజారాహిల్స్ లోని హోటల్ తాజ్ బంజారా హోటల్ ను సీజ్ చేసినట్లు మున్సిపల్ అధికారులు ప్రకటించారు. పేరుకు పోయిన బకాయీలను చెల్లించడంలో తాజ్ బంజారా హోటల్ యాజమన్యం నుంచి స్పందన లేకపోవడంతోనే ఈ చర్యలు తీసుకున్నారు. తాజ్ బంజారా హోటల్ అంటే దేశంలోనే ప్రాముఖ్యమైనదిగా పేరుగాంచిన తాజ్ హోటల్ ను సీజ్ చేయడం చర్చనీయాంశమైంది.