Shiva Balakrishna : విల్లాలు.. కిలోల కొద్దీ బంగారం.. వెండి.. ఖరీదైన వాచ్‌లు ఒక్క అధికారి.. ఇన్ని కోట్ల ఆస్తులా?

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసంలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.

Update: 2024-01-25 03:55 GMT

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసంలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాద్‌లోనే రెండు విల్లాలున్నాయి. ఇక తెలంగాణలోని పలు రాష్ట్రాల్లో పదుల ఎకరాల్లో భూములున్నాయి. వ్యవసాయ భూములు కొనిపడేశాడు. ఇక అపార్ట్‌మెంట్లు కూడా లెక్కకు మించే ఉన్నాయి. బంగారమంటారా... రెండు కిలోలకు పైగానే ఏసీబీ అధికారులు కనుగొన్నారు. వెండి నాలుగున్న కిలోలు.. ఖరీదైన వాచ్ లు... అత్యంత విలువైన కార్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే మనోడి గురించి వర్ణించడానికి పదాలు చాలవేమో.

అక్రమంగా ఆస్తులు కూడేసి...
అలా అడ్డగోలుగా సంపాదించేశాడు మరి. అక్రమంగా ఆస్తులు కూడేసి మరీ కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట ఉంచాడు. ఏసీబీ అధికారులు దాదాపు 70 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇక నగదు అంటారా? దానిని లెక్కపెట్టేందుకు కౌంటింగ్ మెషీన్లు తేవాల్సి వచ్చింది. నలభై లక్షల రూపాయల వరకూ ఆయన ఇంట్లోనే నగదు లభ్యమయినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మణికొండలో అతి ఖరీదైన విల్లాతో పాటు, నానక్ రూమ్ గూడలో మరొక విల్లా ఉన్నట్లు గుర్తించారు. అయితే సోదాలకు శివబాలకృష్ణ సభ్యులు ఏ మాత్రం సహకరించలేదని ఏసీబీ అధికారులు తెలిపారు.
బ్యాంకు లాకర్లు తెరిస్తే...
ఈరోజు బ్యాంకు లాకర్లను కూడా తెరవనున్నారు. మరి లాకర్లలో మనోడు ఎంత దాచి పెట్టాడో బయటపడుతుంది. హెచ్‌ఎండీఏ డైరెక్టర్ గా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు అడ్డగోలు అనుమతులు ఇచ్చి కోట్లాది రూపాయలు కూడబెట్టిన శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించాడన్న సమాచారంతోనే ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. ఆయనను అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నేడో, రేపో ఆయనను కోర్టులో హాజరుపర్చే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News