ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారుల సోదాలు

ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాం కేసులో నిందితుల ఇళ్లలో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

Update: 2025-07-26 11:56 GMT

ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాం కేసులో నిందితుల ఇళ్లలో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉనన రాజ్ కేసిరెడ్డి కార్యాలయం, ఇళ్లలోనూ సోదాలు జరుపుతున్నారు బాలాజీ గోవిందప్ప ఉండే భారతీ సిమెంట్స్ కార్యాలయంలోనూ సిట్ అధికారుల తనిఖీలు చేస్తున్నారు.

ఆరు చోట్ల సోదాలు...
నానక్ రామ్ గూడ్ లోని చాణక్య కు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్, భారతి సిమెంట్స్ లో ఈ సోదాలను సిట్ అధికారులు జరపుతున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. నిందితులు ఎక్కడెక్కడ సమావేశమయ్యారన్న దానిపై సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో పన్నెండు మంది నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News