Sabarimala : అయప్ప స్వాములకు గుడ్ న్యూస్
శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వాములకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది
శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వాములకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి అరవై ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడుపుతుంది. నేటి నుంచి రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉంది. దక్షిణ మధ్య రైల్వే శాఖ నడపనున్న ఈ అరవై ప్రత్యేక రైళ్లు వచ్చే ఏడాది జనవరి వరకూ నడుస్తాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
ప్రత్యేక రైళ్లు...
ప్రత్యేక రైళ్లలో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయని, శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు సురక్షితంగా వెళ్లి స్వామి వారిని దర్శించుకుని తిరిగి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లు ఉపయోగపడతాయని తెలిపింది. చర్లపల్లి, కాచిగూడ, మచిలీపట్నం, నర్సాపూర్, కాకినాడ, విశాఖపట్నం నుంచి ఈ రైళ్లను నడుపుతున్నారు. ఈ రైళ్లు కొల్లం, కొట్టాయం వరకూ ప్రయాణించే రైళ్లలో వెళ్లేందుకు నేటి నుంచి ముందస్తు టిక్కెట్ రిజర్వేషన్ చేసుకునే వీలుంది.