Hyderabad : గ్యాస్ బాయ్ ను బెదిరించిన యూట్యూబర్లు.. పోలీసుల అరెస్ట్
గ్యాస్ సిలిండర్ కష్టాలను కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు
గ్యాస్ సిలిండర్ కష్టాలను కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్ దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో ఎల్.పి.జి గ్యాస్ కొరతతో కొందరు యూట్యూబర్లు బెదిరింపులకు దిగుతున్నారు. విజిలెన్స్ అధికారులమంటూ బెదిరించిన ముగ్గురు యూట్యూబర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్యాస్ డెలివరీ బాయ్ ను బెదిరించిన ముగ్గురు యూట్యూబర్లను ఫిలింనగర్ పరిధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండు లక్షలివ్వాలంటూ...
రెండు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వెంటనే గ్యాస్ డెలివరీ ద్వారా తన వద్ద ఉన్న నగదును వారికి ఇచ్చారు. జరిగిన విషయాన్ని యజమానికి వివరిచంగా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో గ్యాస్ కంపెనీ యజమాని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.