Revanth Reddy : నేడు రేవంత్ రెడ్డి షెడ్యూల్

నేడు తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది

Update: 2026-04-05 02:33 GMT

నేడు తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో...
ఈరోజు సాయంత్రం 6 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో పోలీసుల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమంలోనూ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి విజేతలకు బహుమతులను అందచేయనున్నారు. రేపు బాసరకు వెళ్లి ముఖ్యమంత్రి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన పనులను శంకుస్థాపన చేయనున్నారు.


Tags:    

Similar News