Hyderabad : నేడు సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్‌లో నేడు సేవ్ సింగరేణి పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది
హైదరాబాద్‌లో నేడు సేవ్ సింగరేణి పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. తెలంగాణ జాగృతి, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. సింగరేణిలో ఇటీవల జరుగుతున్న అక్రమాలు, కార్మికులతో పాటు సింగరేణి సంస్థకు ద్రోహం చేసే విధంగా తీసుకునే నిర్ణయాలపై చర్చించనున్నారు.
సింగరేణిని రక్షించుకోవడంపై...
సింగరేణిని మనం రక్షించుకోవాలన్న నినాదంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత, కార్మిక సంఘాల నేతలు హాజరుకానున్నారు. సింగరేణిని రక్షించుకోవమెలా అన్న దానిపై చర్చించనున్నారు.