Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. గోల్కొండలోని ఒక రిసార్టు ఈవెంట్‌లో 200 మంది పాల్గొన్నారు. రిసార్టులో రాత్రి ఈగల్ టీం తనిఖీలు చేశారు. ఓ వేడుకకు హాజరైన కొందరు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఈగల్ టీంకు సమాచారం అందింది.
ఆరుగురికి పాజిటివ్
36 మందికి డ్రగ్స్ కిట్లతో పోలీసులు పరీక్షలు జరిపారు. రిసార్ట్ ఈవెంట్‌లో డ్రగ్స్ తీసుకున్నవారిలో ఆరుగురికి పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చినవారిలో యువతి ఉన్నట్లు సమాచారం. పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నారు.