ముగిసిన కేటీఆర్ విచారణ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది

Update: 2026-01-23 13:05 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు ఉదయం పదకొండు గంటలకు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఉదయం పదకొండు గంటలకల్లా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న కేటీఆర్ సాయంత్రం ఆరు గంటల వరకూ విచారణ సాగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ప్రమేయం ఉందని అనుమానించిన సిట్ అధికారులు విచారణకు రమ్మని పిలవడంతో ఆయన తరలి వచ్చారు.

ఏడు గంటల పాటు...
కేటీఆర్ ను దాదాపు ఏడుగంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. పోలీసు అధికారి రాధా కిషన్ రావుతో కలిపి కేటీఆర్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే కేటీఆర్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరినీ అనుమతించలేదు. భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.


Tags:    

Similar News