సజ్జనార్ కు సింగర్ చిన్మయ్ ఫిర్యాదు
సింగర్ చిన్మయ్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు.
సింగర్ చిన్మయ్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తననే కాకుండా తనతో పాటు తన పిల్లలను కూడా లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారని, అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని ఆమె సజ్జనార్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పిల్లలు చనిపోవాలా? అని తన్మయి ప్రశ్నించారు.
భర్త చేసిన వ్యాఖ్యలపై...
మంగళసూత్రంపై చిన్నయి భర్త రాహుల్ చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారని అన్నారు. ట్రోలర్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలుగు సోషల్ మీడియాలో తనను గత కొంత కాలం నుంచి ట్రోల్స్ చేస్తున్నప్పటికీ ఓపిక వహించినప్పటికీ, తన పిల్లలను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ పై ఆమె సీరియస్ అయ్యారు. సజ్జనార్ కూడా ఆమె ఫిర్యాదును స్వీకరించి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.