ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలడం కారణం కాదు : సిగాచీ కంపెనీ
మృతుల కుటుంబాలకు కోటి పరిహారం అందిస్తామని సిగాచీ సంస్థ ప్రకటించింది.
మృతుల కుటుంబాలకు కోటి పరిహారం అందిస్తామని సిగాచీ సంస్థ ప్రకటించింది. ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందిస్తామని యాజమాన్యం తెలిపింది. ఇప్పటి వరకూ సిగాచీ పరిశ్రమలో పేలుడు కారణంగా నలభై మంది మరణించారని సిగాచీ కంపెనీ యాజమాన్యం తెలిపింది. మరో 33 మంది కార్మికులు గాయపడినట్లు పేర్కొంది.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి...
గాయపడిన వారికివైద్య సహాయం పూర్తిగా అందిస్తామని సిగాచీ పరిశ్రమ సెక్రటరీ వివేక్ కుమార్ తెలిపారు. బాధిత కుటుంబాలకు పరిశ్రమ అండగా ఉంటుందని తెలిపారు. గాయపడిన వారికి కూడా పరిహారం అందిస్తామని తెలిపింది. మూడు నెలల పాటు కంపెనీ కార్యకలాపాలను మూసివేస్తున్నామని తెలిపింది. ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలడం కాదని, ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని, నివేదిక అందిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయని సిగాచీ కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు స్టాక్ మార్కెట్ కు లేఖ కూడా రాశారు.