Bharat Summit : నేడు రెండో రోజు భారత్ సమ్మిట్

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ నేడు రెండో రోజు జరుగుతుంది

Update: 2025-04-26 04:15 GMT

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ నేడు రెండో రోజు జరుగుతుంది. నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశాలున్నాయి. తొలిరోజు సమ్మిట్ కు వందకు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ ను చేపట్టింది.

రాహుల్ ఆదేశాలతోనే...
రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఆయన ఆలోచనల మేరకు ప్రపంచానికి భారత్ నేతృత్వాన్ని వహించేలా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలపై ఈ సమ్మిట్ లో చర్చించనున్నారు. నిన్ననే రాహుల్ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నా జమ్మూకాశ్మీర్ కు వెళ్లడంతో నేడు హైదరాబాద్ వస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు.


Tags:    

Similar News