సేవ్ ఫిల్మ్ ఛాంబర్.. బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ

హైదరాబాద్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేంద్రంగా ఉన్న ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆస్తులు, స్థలం దుర్వినియోగం అవుతున్నాయని పలువురు సినీ ప్రముఖులు నిరసనకు దిగారు

Update: 2025-10-28 15:40 GMT

హైదరాబాద్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేంద్రంగా ఉన్న ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆస్తులు, స్థలం దుర్వినియోగం అవుతున్నాయని పలువురు సినీ ప్రముఖులు నిరసనకు దిగారు. 'సేవ్ ఫిల్మ్ ఛాంబర్, బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ' అంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నిర్మాతలు, నటులు, తదితరులు పాల్గొన్నారు. ఫిల్మ్ ఛాంబర్ స్థలం పరిశ్రమ అవసరాలకే ఉపయోగించాలని వారంతా డిమాండ్ చేశారు. చెన్నై నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్ తరలివచ్చినందుకు గాను ఫిల్మ్ నగర్ సొసైటీలో ఈ ఛాంబర్‌ను కేటాయించారని, ఇది కట్టి దాదాపు 40 ఏళ్లు దాటిందని నిరసన తెలియజేస్తున్న ప్రముఖులు అన్నారు. ఈ స్థలాన్ని చిత్ర పరిశ్రమకు సంబంధించిన అవసరాలకు తప్ప, వేరే వాటికి ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News