సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు: చార్జిషీట్ దాఖలు

హైదరాబాద్ లోని సంధ్య థియేటర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఛార్జిషీట్ దాఖలయింది

Update: 2025-12-27 11:42 GMT

హైదరాబాద్ లోని సంధ్య థియేటర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 23 మందిని నిందితులుగా చార్జిషీట్‌లో పేర్కొన్నారు. వారిలో 14 మందిని అరెస్ట్ చేయగా, ముందస్తు బెయిల్ పొందిన 9 మందికి చట్టపరమైన విధానాల ప్రకారం నోటీసులు అందజేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్లానింగ్‌, గుంపుల నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, సమన్వయం వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలిందని తెలిపారు.

అల్లు అర్జున్ పేరు కూడా...
థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు తదితరుల మధ్య సమన్వయం లోపించిందని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. కేసులో నటుడు అల్లు అర్జున్‌ పేరూ చేర్చారు. ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యజమానులు, భాగస్వాములు, మేనేజ్ మెంట్ సిబ్బంది, ఈవెంట్ నిర్వాహకులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు మాత్రమే కాకుండా సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు ఆయన సన్నిహితుల పేర్లను కూడా చార్జిషీట్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో వారి పాత్రలు, బాధ్యతలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.


Tags:    

Similar News