Breaking : ఐప్యాక్ సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

ఐప్యాక్ సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తుంది.

Update: 2026-04-02 07:49 GMT

ఐప్యాక్ సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తుంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు మూడు రాష్ట్రాల్లో ఐ ప్యాక్ సంస్థల పై దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పదిచోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో ఏకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి.

మనీ లాండరింగ్ కేసులో...
మనీ లాండరింగ్ కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతంలో ఐ ప్యాక్ తన పై నమోదయిన కేసును సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఐ ప్యాక్ ఫౌండర్స్ నివాసాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఐ ప్యాక్ సంస్థ మమత బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తుంది.


Tags:    

Similar News