Telangana : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రేవంత్ కీలక ఆదేశాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు

Update: 2025-11-10 07:04 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ రేపు జరగనుంది. ఈ సందర్భంగా మంత్రులతో సమావేశమయిన రేవంత్ రెడ్డి బూత్ లెవెల్లో అనుకూలమైన ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేలా ఇన్ ఛార్జులను అప్రమత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు.

రేపు సాయంత్రం ఆరు గంటల వరకూ...
దీంతోపాటు రేపు సాయంత్రం ఆరు గంటల వరకూ మంత్రులందరూ అందుబాటులో హైదరాబాద్ లోనే ఉండాలని ఆదేశించారు. పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిసింది. బీఆర్ఎస్, బీజేపీలు ఈ రాత్రికి డబ్బులు పంచకుండా అవసరమైన ఏర్పాట్లను కార్యకర్తల ద్వారా చూడాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడం వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలని మంత్రులను ఆదేశించారు.


Tags:    

Similar News