Revanth Reddy :నేడు ఎన్నికల ప్రచారంలో రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు. షేక్ పేట్ డివిజన్ లో ఆయన కార్నర్ మీటింగ్ లలో పాల్గొననున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్ షోలను నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇంకా ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో రేవంత్ రెడ్డి వరసగా సమావేశాల్లో పాల్గొంటున్నారు.
కార్నర్ మీటింగ్ లతో...
రాత్రివేళ రేవంత్ రెడ్డి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లలో పాల్గొంటూ తమ పార్టీ అభ్యర్థిని ప్రజలకు పరిచయం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెబుతున్నారు. అర్హులైన నియోజకవర్గ పేదలందరికీ తెలుపు రంగు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెబుతున్నారు.