జీహెచ్ఎంసీ నుండి కుక్కను విడుదల చేయండి: హైకోర్టు ఆదేశాలు

ఒక వ్యక్తిపై దాడి చేసిందనే ఫిర్యాదు మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు అదుపులోకి తీసుకున్న పెంపుడు కుక్కను విడుదల చేయాల.

Update: 2025-06-19 13:30 GMT

 dog

ఒక వ్యక్తిపై దాడి చేసిందనే ఫిర్యాదు మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు అదుపులోకి తీసుకున్న పెంపుడు కుక్కను విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ఆదేశించారు. కుక్క యజమాని ఇ.బి.దక్షిణామూర్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ చిక్కడపల్లిలోని ఎక్కలదేవి ఎలైట్ భవనంలో నివసిస్తున్నారు. అతను డ్యూగో అర్జెంటీనో జాతికి చెందిన కుక్కను పెంచుకున్నారు. కొన్ని వారాల క్రితం, పిటిషనర్ సోదరుడు ఇ.బి.నరసింహ మూర్తి చిక్కడపల్లి పోలీసులకు ఆ కుక్క తనపై దాడి చేసిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంతో జిహెచ్‌ఎంసి అధికారులు కుక్కను అదుపులోకి తీసుకుని బోనులో ఉంచారు.

జిహెచ్‌ఎంసి అధికారుల కస్టడీలో ఉన్న తన కుక్కకు సరైన సంరక్షణ లేకపోవడం వల్ల బాధపడుతోందని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. కుక్కను విడుదల చేస్తూ హై కోర్టు ఆదేశాలను జారీ చేసింది. భారతదేశంలో డ్యూగో అర్జెంటీనో జాతిని నిషేధించినట్లయితే పిటిషనర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు.

Tags:    

Similar News