ఐబొమ్మ అరెస్ట్ పై ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు
సినిమాల పైరసీ, ఐబొమ్మ రవిపై రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు
సినిమాల పైరసీ, ఐబొమ్మ రవిపై రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రవిని రాబిన్‌హుడ్‌తో పోల్చడాన్ని తప్పుబట్టిన ఆర్జీవీ రాబిన్‌హుడ్ హీరో కాదని అన్నారు. పైరసీదారులే కాదు.. పైరసీ చూసేవాళ్లు కూడా నేరస్థులేనని రాంగో్పాల్ వర్మ అన్నారు. పైరసీని చూసే 100 మందిని అరెస్టు చేయాలని, అరెస్టు చేసి పేర్లు బయటపెడితేనే అది ఆగుతుందని రాంగోపాల్ వర్మ తెలిపారు.
పైరసీ సమస్యకు...
పైరసీ సమస్యకు భయం ఒక్కటే పరిష్కారమని, నైతిక విలువలు పనిచేయవని వర్మ అన్నారు. టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని పైరసీ చేయడం సరికాదన్న రాంగోపాల్ వర్మ కార్లు, గోల్డ్ ధరలు ఎక్కువగా ఉన్నాయని లూటీ చేయలేం కదా? అని దర్శకుడు రాంగోపాల్ వర్మప్రశ్నించారు. అందుకే పైరసీ సినిమాలు చూడకుండా ప్రజల్లో చైతన్యం వంతుల్నిచేయాలని అన్నారు.