Raja Singh : కిషన్ రెడ్డిపై రాజాసింగ్ హాట్ కామెంట్స్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2025-10-14 06:52 GMT

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతుందంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు మిమ్మిల్ని అడుగుతున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆయన కోరారు. రాజాసింగ్ నేరుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో వేలు పెట్టే అలవాటున్న మీకు, తన జిల్లాను కూడా సర్వనాశనం చేసి తనను పార్టీ నుంచి బయటకు పంపారని అన్నారు. మీరు కూడా పార్టీ నుంచి ఏదో ఒకరోజు బయటకు వెళ్లడం పక్కా అంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాజాసింగ్ వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ మాగంటి సునీతను, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ న పోటీకి దింపుతున్నట్లు ప్రకటించింది. బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీనిపై నాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై రాజాసింగ్ చేసిన హాట్ కామెంట్స్ సంచలనంగా మారాయి.


Tags:    

Similar News