Heavy Rain : హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం
హైదరాబాద్ లో వర్షం ఉదయం నుంచి కురుస్తూనే ఉంది. అనేక ప్రాంతాల్లో వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి
హైదరాబాద్ లో వర్షం ఉదయం నుంచి కురుస్తూనే ఉంది. అనేక ప్రాంతాల్లో వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మొహిదీపట్నం, గోల్కొండ, టోలీచౌకీ, షేక్ పేట్ లలో వర్షం భారీగా పడటంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. దీంతో పాటు రహదారులపై కూడా నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్...
రహదారులపై నిలిచిపోయిన నీటిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ శాఖ సిబ్బంది బయటకు తోడేస్తున్నారు. రోడ్లపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి.నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.