Rain Alert : నేడు, రేపు ఒంటి పూట బడులు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు ఆగస్టు 13, 14 తేదీలలో అతి భారీ వర్షాల కారణంగా తెలంగాణ పాఠశాల విద్యా డైరెక్టర్ ఒంటి పూట బడులను ప్రకటించారు.

వాతావరణ నివేదిక ప్రకారం.. ఈ రెండు రోజులు GHMC పరిధిలోని కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విద్యార్థుల భద్రత, రవాణా సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసిన విద్యా శాఖ.. ఈ రెండు రోజులు పాఠశాలలు ఉదయం షిఫ్ట్ సమయంలో మాత్రమే పనిచేస్తాయని పేర్కొంటూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జారీ చేసిన ఈ ఆదేశాలు GHMC ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు వర్తిస్తుంది. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థులకు సమాచారం అందించాలని అధికారులు పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. తదుపరి చర్యల కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు, కలెక్టర్‌లకు ఈ సర్క్యులర్‌ను పంపించారు.