చీప్ గా చికెన్.. కేజీ చికెన్ ఎంతో తెలిస్తే?
హైదరాబాద్ లో చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. చీప్ గా చికెన్ దొరుకుతున్నా మాంసం ప్రియులు ఎగబడటం లేదు.
హైదరాబాద్ లో చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. చీప్ గా చికెన్ దొరుకుతున్నా మాంసం ప్రియులు ఎగబడటం లేదు. కిలో చికెన్ ధర నూట యాభై రూపాయలకే విక్రయిస్తున్నప్పటికీ అమ్మకాలు లేక ఈగలు తోలుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ ధరలు తగ్గిపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ధరలు తగ్గించి విక్రయిస్తున్నా కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు.
విక్రయాలు లేక...
మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కోళ్లు, కోడిగుడ్లు వంటివి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతోనే అధికారులు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అటు నుంచి వెనక్కు పంపుతున్నారు. హైదరాబాద్ లో యాభై శాతం విక్రయాలు పడిపోయాయి.