2 నెలల కిందటే ఉద్యోగంలో చేరిన ప్రసన్న.. ఇంతలో

పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన పేలుడు ఎంతో మంది జీవితాలను చిదిమేసింది.

Update: 2025-07-02 08:45 GMT

పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన పేలుడు ఎంతో మంది జీవితాలను చిదిమేసింది. తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన పోలిశెట్టి ప్రసన్న కూడా ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందింది. చాగల్లుకు చెందిన శ్రీనివాసరావు తాపీమేస్త్రీగా పని చేస్తూ మదర్‌థెరిసా సేవా సమితి పేరిట సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయనకు ప్రసన్న, ప్రభుకుమారి అనే ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాసరావు మేనల్లుడు యాతం జయమహేష్‌ సిగాచీ ఇండస్ట్రీస్‌లో పని చేస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రసన్నకు అదే సంస్థలో రెండు నెలల కిందట ఉద్యోగం వచ్చింది. ఇంకొన్ని నెలల్లో ఆమెకు వివాహం చేయాలని కుటుంబం అనుకుంటుండగా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ప్రసన్న ప్రాణాలు కోల్పోయారు.

Tags:    

Similar News