ప్రశాంతంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది.

Update: 2025-11-11 04:27 GMT

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచి భారీగా ఓటర్లు చేరుకంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 45 శాతం మాత్రమే ఇక్కడ పోలింగ్ జరిగింది. అయితే ఈసారి అరవై శాతం పోలింగ్ జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీఐపీల నుంచి సామాన్యులు, సెలబ్రిటీలు ఇలా వరస బెట్టి పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచి తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

అన్ని పార్టీలకు చెందిన...
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చి అన్ని పార్టీలకు చెందిన ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నాు.


Tags:    

Similar News