జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నవంబరు 11న
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ తేదీ ఖరారయింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ తేదీ ఖరారయింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. నవంబరు 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. 14వ తేదీన ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరగనుందని వెల్లడించింది. అక్టోబరు 13న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల ఉప సంహరణ 21వ తేదీతో ముగియనుంది. నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడానికి అక్టోబరు 24వ తేదీ వరకూ సమయం ఉంది.
జూబ్లీహిల్స్ తో పాటు...
తెలంగాణతో పాటు మొత్తం దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ ఉప ఎన్నికల్లో గోపీనాధ్ భార్య మాగంటి సునీతను తమ పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.