Hyderabad : భారీ డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్
హైదరాబాద్ లో డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పరిధిలో ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు
హైదరాబాద్ లో డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పరిధిలో ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 190 గ్రాముల హెరాయిన్ ను నిందితుల నుంచి రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకు వచ్చి ఇక్కడ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి...
అందిన సమాచారం మేరకు తనిఖీలు చేసి మరీ రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ను ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎవరి కోసం తెస్తున్నారు? వంటి వివరాలను నిందితుల నుంచి సేకరించే పనిలో రాచకొండ పోలీసులు ఉన్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.