జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు లాఠీ ఛార్జి

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా పోలీసులు లాఠీ ఛార్జి చేశారు

Update: 2025-11-11 11:58 GMT

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. షేక్ పేట్ లోని 4, 5, 6 డివిజన్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దయెత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి హడావిడి చేయడంతో పోలీసులు ఎన్నికల నిబంధనల మేరకు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. కానీ మాజీ మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చి షేక్ పేట్ కు వచ్చి పోలింగ్ బూత్ ల వద్దకు రావడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.

పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి...
నాన్ లోకల్స్ ఇక్కడకు వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద హడావిడి చేస్తుండటంతో పోలీసులు ముందు వార్నింగ్ ఇచ్చారు. తర్వాత అక్కడ ఉన్న వారిని చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీ ఛార్జి చేశారు. ఈ సందర్భంగా కొందరు బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జూబ్లీహిల్స్ లో పోలింగ్ శాతం పెద్దగా జరిగే అవకాశం లేకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి హడావిడి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.


Tags:    

Similar News