Hyderabad : నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ లో నేడు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ లో నేడు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ లో దాదాపు లక్షన్నర మంది మహిళలతో ఇందిరా మహిళ శక్తి కార్యక్రమం ఉండటంతో అటువైపు వెళ్లే వాహనదారులు అలెర్ట్ గా ఉండాల్సిందే.
పరేడ్ గ్రౌండ్స్ వైపు...
పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే అన్ని రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధింంచినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. మీటింగ్ కు పెద్ద సంఖ్యలో మహిళలతో పాటు వీఐపీలు కూడా హాజరవుతున్నందున వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాలని కోరారు.