Hyderabad : తాగి వాహనం నడిపితే.. ఇక అంతే
మద్యం తాగి వాహనాలలో రోడ్లపై వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పోలీసులు తెలిపారు
న్యూ ఇయర్ సందర్బంగా మద్యం తాగి వాహనాలలో రోడ్లపై వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని 120 ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని చెప్పార. జనవరి మొదటి వారం అంతా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల సీజ్ తో పాటు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
పదివేల జరిమానా...
రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పది వేలకు పైగా జరిమానా ఉంటుందని తెలిపారు. మద్యం సేవించిన వారు డ్రైవింగ్ చేయకుండా క్యాబ్ లేదా డ్రైవర్లను ఆశ్రయించాలని కోరుతున్నారు. కొత్త సంవత్సవ వేడుకలను మీ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో క్షేమంగా జరుపుకోవాలని కోరుతున్నామని హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.