South Central Railway : భారతదేశం లోనే కాదు. విదేశీ టూర్లకు వెళ్లాలనుందా? రైల్వే స్పెషల్ ఆఫర్ ఇదే
దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా రైళ్లను ఎంచుకుంటారు. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
రైళ్లలో ప్రయాణం సురక్షితం.. సుఖం. అందుకే దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా రైళ్లను ఎంచుకుంటారు. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. దేశ వ్యాప్తంగా ఆలయాలను సందర్శించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. తీర్థయాత్రలకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది. ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మధిర నుండి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తీర్థ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను అలాగే సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు దేశీయ ఎయిర్ ప్యాకేజీలను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.