హైడ్రా జిందాబాద్ అంటూ జై కొట్టిన వనస్థలిపురం వాసులు

హైడ్రా అధికారులకు హైదరాబాద్ లోని వనస్థలి పురం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు

Update: 2025-04-19 07:39 GMT

హైడ్రా అధికారులకు హైదరాబాద్ లోని వనస్థలి పురం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రాకు జై కొట్టిన వనస్థలిపురం ఇంజాపూర్ వాసులు తమ ప్రాంతంలో ఆక్రమణలను తొలగించినందుకు ధన్యావాదాలు తెలిపారు. వనస్థలిపురంలో ఉన్న పలు కాలనీలకు వెళ్ళే ప్రధాన రోడ్డును ఆక్రమించిన స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ నిర్మాణాలను చేపట్టింది.

రోడ్డు ఆక్రమణలపై...
రోడ్డు ఆక్రమణపై హైడ్రా అధికారులను ఆశ్రయించిన కాలనీవాసులు ఈ కంపెనీపై ఫిర్యాదు చేశారు. రోడ్డుకు అడ్డంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులుకూల్చివేశారు. దీంతో తమ ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా అధికారులకు కాలనీ వాసులందరూ హైడ్రా కు జై కొట్టారు. ఆక్రమణలను తొలగించి తమను కాపాడారంటూ వారు కృతజ్ఞతలు తెలిపారు.


Tags:    

Similar News