Breaking : హైదరాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు
హైదరాబాద్ లో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
NIA conducted raids in four states of the country
హైదరాబాద్ లో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. సీనియర్ జర్నలిస్టు, వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. హిమాయత్ నగర్ లో ఉన్న ఆయన ఇంట్లో ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. ఎల్.బి.నగర్ లో ఉన్న రవి శర్మ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
మావోయిస్టులతో...
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కారణంతో అధికారులు ఈ సోదాలు జరుగుతున్నాయి. ఉదయం నాలుగు గంటలకు వేణుగోపాల్ ఇంటికి చేరకున్న అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వేణుగోపాల్ మావోయిస్టుల సానుభూతిపరుడిగా అనుమానించి ఈ సోదాలను నిర్వహిస్తున్నారని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.