ఎన్టీఆర్ కు ఘాట్ వద్ద ఘన నివాళులు

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు

Update: 2025-01-18 04:43 GMT

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తెల్లవారు జామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించారు. నటుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తర్వాత నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించారు.

కుటుంబ సభ్యులు వచ్చి...
తర్వాత లోకేష్, భువనేశ్వరి వచ్చి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి టీడీపీ కార్యకర్తపై ఉందని లోకేష్ అన్నారు. ఆయన స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నామని, కోటి సభ్యత్వాలు దాటి రికార్డు సాధించడానికి కూడా ఎన్టీఆర్ ప్రేరణ అని లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను ప్రజలు నేటికీ గుర్తుంచుకుంటారన్న లోకేష్, ఏపీలో సంక్షేమం, భివృద్ధి సమానంగా తీసుకెళుతున్నామని తెలిపారు.


Tags:    

Similar News