మహిళల వస్త్రధారణపై నాగబాబు ఏమన్నారంటే?
మహిళలపై వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్సీ నాగబాబు వీడియో విడుదల చేశారు.
మహిళలపై వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్సీ నాగబాబు వీడియో విడుదల చేశారు. మహిళల వస్త్ర ధారణపై ఎవరు మాట్లాడినా అది తప్పు అవుతుందన్నారు. పండితుల నుంచి పామరుల వరకూ మహిళల వస్త్రధారణలపై కామెంట్స్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయిందన్న నాగబాబు, తాను శివాజీ గురించి ఈ అభిప్రాయాన్ని తెలియచేయడం లేదని అన్నారు.
మోరల్ పోలీసింగ్...
ఆయన వీడియోలో మాట్లాడుతూ "మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధం.. మగ అహంకారంతో ఆడ పిల్లల వస్త్రధారణపై మాట్లాడుతున్నారు. ఆడపిల్లలపై అలా మాట్లాడేందుకు ఏం హక్కుంది?.. ప్రపంచంలో ఫ్యాషన్ రోజురోజుకి మారిపోతుంటుంది.. ఒకప్పుడు నేను కూడా ఆలోచించేవాడిని, కానీ నా ఆలోచన మార్చుకున్నాను.. ఆడపిల్లలను బతకనీయండి, మగవారితో సమానంగా బతికే హక్కు వారికి లేదా?.. ఆడవాళ్లు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోండి, ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోండి" ని నాగబాబు అన్నారు.