జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రి పొన్నం సంచలన కామెంట్స్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుండ మార్పిడి చేసుకున్నట్లుగా బీఆర్ఎస్, బీజేపీ ఓట్ల మార్పిడి చేసుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ గత పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓట్లను బీజేపీకి బదలాయించిందని, అందుకు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ ఓట్లను బీఆర్ఎస్ వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. రెండు పార్టీలూ ఒక్కటేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తానే అధికారంలో ఉందని...
బీఆర్ఎస్ ఇంకా తానే అధికారంలో ఉందని భ్రమపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సమాచారంతో ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ తనిఖీలు చేస్తుంటే సహకరించాల్సింది పోయి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచి గెలవాలని బీఆర్ఎస్ భావిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయినా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్ వైపు నిలబడతారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.