Hyderabad : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలు వేళల పొడిగింపు

హైదరాబాద్ వాసులకు మెట్రో రైలు కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-12-30 11:54 GMT

హైదరాబాద్ వాసులకు మెట్రో రైలు కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు వేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు ఇయర్ ఎండింగ్ సందర్భంగా మెట్రో రైలు వేళలను పెంచాలని నిర్ణయించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకూ మెట్రో రైళ్లు పరుగులుతీయనున్నాయని అధికారులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా ఈ మెట్రో రైలు వేళలను పొడిగిస్తున్నట్లు తెలిపారు.

కొత్త సంవత్సరం వేడుకల ముగింపునకు...
ఏదైనా బిగ్ ఈవెంట్స్ నగరంలో ఉన్నప్పుడు మెట్రో రైలు వేళలను పొడిగించడం మామూలే. గత ఏడాది కూడా మెట్రో రైలు వేళలను పొడిగించారు. అదే సంప్రదాయన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా డిసెంబరు 31వ తేదీ రాత్రి ఒంటి గంట వరకూ మెట్రో రైళ్లు హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అందువల్ల రహదారులపై ప్రయాణం కంటే మెట్రో రైలు ప్రయాణమే సుఖవతమే కాకుండా భద్రత కూడా ఉంటుందని చెబుతున్నారు


Tags:    

Similar News